Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్ పాస్‌ను కండక్టర్‌కు చూపించాలి

బస్ పాస్‌ను కండక్టర్‌కు చూపించాలి

- Advertisement -

కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్
నవతెలంగాణ – కామారెడ్డి

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే జర్నలిస్టులు ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్ట్ (అక్రిడిటేషన్) బస్ పాస్‌ను విధిగా కండక్టర్‌కు చూపించాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ సూచించారు. ఇటీవల ఓ వ్యక్తి గతంలో ప్రముఖ జర్నలిస్టుకు జారీ చేసిన బస్సు పాస్‌పై తేదీని మార్చి, తన పాస్‌గా చూపిస్తూ కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వరకు ప్రయాణించిన ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ సదరు వ్యక్తిని ప్రశ్నించగా, సరైన బస్సు పాస్ లేదని గుర్తించి టికెట్‌కు సంబంధించిన నగదును వసూలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనల వల్ల ఆర్టీసీకి ఆదాయ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టుల బస్ పాస్‌ల దుర్వినియోగాన్ని నివారించేందుకు, బస్సులో ప్రయాణించే సమయంలో ప్రతి జర్నలిస్టు తమకు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే బస్సు పాస్‌ను కండక్టర్‌కు తప్పనిసరిగా చూపించాలని డిపో మేనేజర్ దినేష్ సూచించారు. ఆర్టీసీ సిబ్బందికి సహకరించి పాస్‌లను సక్రమంగా వినియోగించాలని ఆయన జర్నలిస్టులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -