- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో నవతెలంగాణ దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజంలోని సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. నవతెలంగాణ దినపత్రిక భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది ప్రజలకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -


