నవతెలంగాణ – కామారెడ్డి
సాహసోపేత బైక్ యాత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన తాడ్వాయి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మహేష్‌ను దేమికలాన్ గ్రామస్తులు, చిన్ననాటి మిత్రులు, క్లాస్‌మేట్స్ ఘనంగా సన్మానించారు. కామారెడ్డి పట్టణంలోని వశిష్ట కాలేజీలో ఆదివారం అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ లడఖ్‌లో సుమారు 2,100 కిలోమీటర్ల బైక్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ లా పాస్‌ను సాహసోపేతంగా అధిగమించినట్లు వివరించారు. ఏడు రోజులపాటు సాగిన ఈ యాత్రలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దేమికలాన్ గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు, చిన్ననాటి మిత్రులు, డిగ్రీ క్లాస్‌మేట్స్ మహేష్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మాజీ ఎంపీపీ రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్‌తో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


