Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యమే ఆయువును పెంచేలా జీవించాలి 

ఆరోగ్యమే ఆయువును పెంచేలా జీవించాలి 

- Advertisement -

బిఎస్ఎన్ఎల్ టిటి తలారి వెంకటస్వామి ఉద్యోగ విరమణ వేడుకలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 
దంపతులకు ఘనంగా సన్మానం
నవతెలంగాణ-వనపర్తి  

మన ఆరోగ్యమే మన ఆయువును పెంచేలా మన జీవన విధానం ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని ఎం వై ఎస్ బాంక్వెట్ హాల్‌లో ఆదివారం బి ఎస్ ఎన్ ఎల్ టి టి తలారి వెంకటస్వామి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కౌసల్య- వెంకటస్వామి దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 1994 నుండి 2026 వరకు బిఎస్ఎన్ఎల్ శాఖలో టీటీగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న తలారి వెంకటస్వామి ఇకనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయుష్షును పెంచుకునేలా జీవించాలని సూచించారు. 32 ఏళ్ల పాటు బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఆయన అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలుస రమేష్ గౌడ్, ప్రేమ నాథ్ రెడ్డి, శంకర్ గౌడ్, రవి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -