Sunday, August 30, 2026
E-PAPER
Homeజిల్లాలురేపు మండలానికి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాక

రేపు మండలానికి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాక

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి
నవతెలంగాణ – తిమ్మాజిపేట
రేపు తిమ్మాజిపేట మండలానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8:00 గంటలకు బుద్ధ సముద్రం గ్రామంలో నిర్వహించే పోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ, 10:00 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, మరికల్ గ్రామంలో 11:00 గంటలకు ప్రధానోపాధ్యాయులు సాయిబాబా పదవీ విరమణ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -