Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల సమస్యలపై ప్రజావాణిలో సీపీ(ఎం) వినతి

గ్రామాల సమస్యలపై ప్రజావాణిలో సీపీ(ఎం) వినతి

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని వివిధ గ్రామాలలో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజావాణి లో సీపీ(ఎం) ఆధ్వర్యంలో ఎంపీడీవో, సూపరింటెండెంట్ నరసింహారావుకు వినతి పత్రాన్ని అందించామని ఆ పార్టీ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  గత సీజన్లో మొక్కజొన్న రైతులకు గన్ని బస్తాలకు, వాహనాల, కిరాయిలు చెల్లిస్తామని చెప్పిన ఇంతవరకు చెల్లించలేదని, గ్రామాల్లో దోమల బెడద విపరీతంగా ఉందనీ, ప్రజలు రోగాల బారిన పడకముందే దోమల మందు పిచికారీ చెయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంతర్గత రోడ్లలో, మురికి గుంటలో బ్లీచింగ్ పౌడర్‌ వేయాలని, రీపేర్లో వున్న బోరింగ్ పంపులను అందుబాటులోకి తేవాలని కోరారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీ(ఎం) నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్, బానాలయాకయ్య, భూక్య బిక్షపతి, బండ వెంకన్న, బత్తిని వెంకన్న, ఇసంపేల్లి సంగీత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -