Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ ఔన్నత్యాన్ని కాపాడారు

అసెంబ్లీ ఔన్నత్యాన్ని కాపాడారు

- Advertisement -

– మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు సీఎం ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు సభ ఔన్నత్యాన్ని కాపాడారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్మరించుకున్నారు. ఆయన అసెంబ్లీని హుందాతనంగా నడిపారని కొనియాడారు. శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. సర్పంచ్‌ నుంచి స్పీకర్‌ స్థాయి వరకు అన్ని పదవులకు శ్రీపాదరావు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజరు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -