Monday, August 31, 2026
E-PAPER
HomeNewsఒకే రోజు 16 కొత్త శాఖలని ప్రారంభించిన కరూర్ వైశ్యా బ్యాంక్

ఒకే రోజు 16 కొత్త శాఖలని ప్రారంభించిన కరూర్ వైశ్యా బ్యాంక్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్య బ్యాంక్ (కెవిబి), కొత్తగా 16 శాఖలు ప్రారంభించడం ద్వారా కీలక మార్కెట్లలో విస్తరించి, దక్షిణ భారతదేశం, ఢిల్లీ ఎన్‪సిఆర్ వ్యాప్తంగా తన ఉనికి మరింత బలోపేతం చేసుకుంది. ఈ తాజా విస్తరణతో, ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖల నెట్వర్క్ 919కి చేరింది.

ఈ కొత్త శాఖల్లో ఆరు తమిళనాడులోను, ఐదు ఆంధ్రప్రదేశ్ లోను, మూడు తెలంగాణలోను, కర్నాటక, ఢిల్లీ ఎన్‪సిఆర్ ల్లో ఒక్కోటి ప్రారంభమయ్యాయి.

బ్యాంక్ విస్తరణ ప్రయాణంలో గణనీయమైన మైలురాయిని సాధిస్తూ, వివిధ ప్రదేశాల్లో కెవిబి ఒకే రోజు పలు శాఖల్ని ప్రారంభించింది. కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ, శ్రీ రమేష్ బాబు, హైదరాబాద్ లోని కొత్త గచ్చిబౌలి శాఖని ప్రారంభించి, మిగిలిన శాఖల్ని విడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించడం ద్వారా ఈ విస్తరణ మైలురాయికి సారథ్యం వహించారు.

తెలంగాణలో, ఇతర రెండు కొత్త శాఖలని స్థానిక ప్రముఖులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ప్రారంభించారు. హైదరాబాద్ – కోకాపేట శాఖ ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (బంజారా హిల్స్) అధ్యక్షులు, డా. ప్రభు కుమార్ చల్లగాలి, ముఖ్య అతిథిగా హాజరై, మెడికవర్ హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డా. పేరుం పృథ్వితో కలిసి సాంప్రదాయిక గాయత్రి దీపం వెలిగించి ప్రారంభించారు. ఇంద్రేషం శాఖని ఇంద్రేషం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, శ్రీ ఎస్. అజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మెడిస్టార్ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్. లతా పోతుగంటితో కలిసి గాయత్రీ దీపం వెలిగించి ప్రారంభించారు.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ మూడు శాఖలు, ప్రధాన ప్రాంతాల్లో, అత్యంత సులువుగా చేరుకోగలిగే ప్రాంతాల్లో ఉన్నాయి. గచ్చిబౌలి శాఖ జయభేరీ ఎన్‪క్లేవ్ లో వుండగా, కోకాపేట శాఖ గోల్డెన్ మైల్ లేఅవుట్ లో వుంది, ఇంద్రేషం శాఖ సంగారెడ్డి జిల్లా మెడిస్టార్ హాస్పిటల్స్ దగ్గర మెయిన్ రోడ్డు మీదే వుంది.

మెట్రోపాలిటన్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లలో తన ఉనికిని మరింతగా విస్తరించాలనే కెవిబి వ్యూహంలో ఈ విస్తరణ ఒక భాగం. గచ్చిబౌలి, కోకాపేట, ఇంద్రేషంల్లో ఈ కొత్త శాఖలతో తెలంగాణలో కెవిబి ఉనికి మొత్తం 65 నుంచి 68 ప్రాంతాలకి విస్తరించింది (వీటిల్లో 66 సాధారణ బ్యాంకింగ్ శాఖలు, 2 రిటైల్ అసెట్ ప్రాసెసింగ్ శాఖలు).

శ్రీ రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ, కరూర్ వైశ్యా బ్యాంక్,ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మంచి వ్యాపార అవకాశాలు, వినియోగదారులతో మా సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు వున్నాయని అనుకున్న ప్రాంతాలలో మేము మా శాఖల నెట్వర్క్ ను విస్తరిస్తూనే ఉన్నాం. డిజిటల్ బ్యాంకింగ్ వల్ల రోజువారీ లావాదేవీలు ఎంతో సులభతరం అయినప్పటికీ, ముఖ్యంగా ఎంఎస్ఎంఇ, రిటైల్ వ్యవసాయ రంగాలకు చెందిన వినియోగదారుల విషయంలో బ్యాంక్ శాఖలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు, అలాగే వారికి వ్యక్తిగతీకరించిన, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు రెండింటినీ అందించే సౌలభ్యాన్ని కల్పించేందుకు ఈ కొత్త శాఖలు మాకు సహాయపడతాయి” అన్నారు.

బ్యాంక్ వ్యాపారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి నేపథ్యంలోనే ఈ విస్తరణ జరిగింది. 2026 జూన్ 30 నాటికి, కెవిబి మొత్తం వ్యాపారం రూ. 2,27,267 కోట్లుగా ఉంది; ఇందులో రూ. 1,22,587 కోట్ల డిపాజిట్లు, రూ. 1,04,680 కోట్ల అడ్వాన్సులు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంక్ రూ. 756 కోట్ల అత్యధిక త్రైమాసిక నికర లాభాన్ని నమోదు చేసుకుంది.

తన శాఖల నెట్వర్క్ తో పాటు, కెవిబి తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలను కూడా బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తూనే ఉంది. దీని మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ‘కెవిబి డిలైట్’, 150కి పైగా ఆర్థిక, ఆర్థికేతర సేవలు అందిస్తూ, వినియోగదారులు వారి మొబైల్ ఫోన్ల ద్వారా విస్తృత శ్రేణి బ్యాంకింగ్ సేవలను పొందే వీలుకల్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -