– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ- సదాశివపేట
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక డీసీఎంఎస్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులపై అధికారులను నిలదీశారు. శనగలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించగా.. కోటా పూర్తయిందని అధికారులు సమాధానం చెప్పారు. రైతులు పండించిన పంటకు సరైన ధర రాక ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. విత్తనాల సరఫరాలో లోపాలు, ఎరువుల కొరత, రైతుబంధు నిధుల ఆలస్యం వంటి అంశాలు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు.
ఇదిలా ఉండగా, శనగ కొనుగోళ్ల కోసం సదాశివపేట పరిధిలోని ఏటిగడ్డ ప్రాంతానికి చెందిన రైతులు వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తన సమక్షంలోనే రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని హరీశ్‌రావు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి శనగ కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ సీడీసీ చైర్మెన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం, శివరాజ్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్మెన్ చింత గోపాల్ ఉన్నారు.
పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



