Tuesday, September 1, 2026
E-PAPER
Homeసినిమా‘కూర్మ అవతార్‌’.. గొప్ప విజన్‌తో తీసిన సినిమా

‘కూర్మ అవతార్‌’.. గొప్ప విజన్‌తో తీసిన సినిమా

- Advertisement -

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో, హర్ష వర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూర్మ అవతార్’. నరేంద్ర కొండ సమర్పణలో పంచ వక్త్ర పిక్చర్స్ -రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్ పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌ కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సోమవారం మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘టీజర్ మైండ్ బ్లో యింగ్‌గా ఉంది. విజువల్స్ అద్భు తంగా ఉన్నాయి. డైరెక్టర్ హర్ష సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ‘నరసింహ అవతార్’, ‘ఇరుముడి’ సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుం దని కోరుకుంటున్నాను. విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. శివ రాజ్‌కుమార్ ఒక సూపర్‌స్టార్. మొన్ననే పెద్దితో సర్ప్రైజ్ చేశారు. ఈ టీజర్‌లాగే రెండు గంటల సినిమా కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను బాలయ్య ‘శాతకర్ణి’ సినిమాలో చేశాను. రీసెంట్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో చేశాను. ఇప్పుడు ‘కూర్మావతార్’ సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను తీశారు. నిర్మాతలు ఈ సినిమాను ప్రతిష్టాత్మ కంగా తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని శివరాజ్ కుమార్ చెప్పారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ‘మేమందరం చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. మా డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు .
సాయికుమార్ మాట్లాడుతూ, ‘శివ న్న ఈ సినిమా చేయడం దైవ సం కల్పం. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్. హర్ష కథ చెప్పగానే చాలా నచ్చింది. సినిమా అద్భు తంగా వచ్చింది’ అని అన్నారు.
‘నేను తొలి సినిమా చేస్తున్న దర్శకుడిని. కథ చెప్పగానే ఆ పాత్రను అంగీకరించిన శివరాజ్‌కుమార్‌కి థ్యాంక్స్‌’ అని చెప్పారు.
నిర్మాత నరేంద్ర మాట్లాడుతూ,‘నా తొలి సినిమా ఇది. విష్ణుమూర్తికి సంబంధించిన రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడం అదృ ష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. మరో నిర్మాత పూజిత మాట్లాడుతూ, ‘ఓ మంచి సినిమాతో ప్రేక్ష‍కుల ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -