Tuesday, September 1, 2026
E-PAPER
Homeసినిమాయూనిక్‌ కథతో ‘గుడ్‌ టైమ్‌’

యూనిక్‌ కథతో ‘గుడ్‌ టైమ్‌’

- Advertisement -


ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుడ్ టైం’. సన్ స్టూడీయోస్, లహరి మ్యూజిక్ ఆధ్యర్యంలో ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి, లక్ష్మణ్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ తిక్క, నందు, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
యు ఎఫ్ ఓ జోనల్ హెడ్ లక్ష్మణ్ గుంటూరు మాట్లాడుతూ,‘ ఈ సినిమాకు ఇక్కడి నుంచి మంచి టైం మొదలవుతుంది’ అని అన్నారు. ‘డైరెక్టర్ చాణక్య చెప్పిన కథ, సినిమా పేరు గుడ్ టైం అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. సినిమా అవుట్ పుట్ చూసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ కార్తీక్ చెప్పారు.
హీరోయిన్ అన్యుక్త నలాని మాట్లాడుతూ,‘దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇలాంటి పాత్రకి నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు’ అని అన్నారు.
‘ఈ సినిమాతో టీంకు గుడ్ టైం వస్తుందని ఆశిస్తున్నాను’ అని నిర్మాత రమేష్ జిల్లా చెప్పారు.
‘యాక్టర్ అవ్వాలనే నా కల ఈ సినిమాతో ఫుల్ ఫిల్ అయ్యింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, మధ్యతరగతి నుంచి వచ్చిన నాపై నమ్మకంతో ఇంత పెద్ద సినిమా బాధ్యతను ఇచ్చిన డైరెక్టర్ చాణక్య, నిర్మాత రమేష్ ఇద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదొక నిజాయితీగా తీసిన అద్భుతమైన సినిమా’ అని హీరో నిఖిల్ తెలిపారు. డైరెక్టర్ చాణక్య జిల్లా మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంది. దాన్ని అందరూ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ,‘సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గుడ్ టైం రావాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ప్రొడ్యూసర్ కు కాసుల వర్షం కురవాలి’ అని తెలిపారు.
‘టీజర్ చాలా బాగా నచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఏమి లేదు కంటెంట్ బాగుంటే చాలు. ఇందులో అందరూ మల్టీ ట్యాలెంటెడ్ లా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్ష‍ిస్తున్నాను’ అని హీరో నందు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -