Tuesday, September 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ సర్కిల్ పోలీస్ శభాష్...

ముధోల్ సర్కిల్ పోలీస్ శభాష్…

- Advertisement -

– 33 కేసుల నిందితులను పట్టుకొవటంపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు… 
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ నియోజకవర్గంలోని భైంసా సబ్ డివిజన్ పరిధిలో గత 8 నెలల కాలంలో కాలంలో ట్రాన్స్ఫార్మర్ చోరీల ఘటన పోలీసులకు సవాలుగా మారడంతో ముధోల్ సర్కిల్ పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకొని, ఏకంగా 33 కేసులు చేదించి ముధోల్  పోలీసులు రైతుల చే  శభాష్ అనిపించుకుంటున్నారు. పూర్తి వివరాలోకి వెళ్తే… భైంసా సబ్ డివిజన్ పరిధిలో ఎనిమిది నెలలో ముధోల్, బైంసా టౌన్, భైంసా రూరల్, బాసర, తానుర్, కుబీర్, కుంటాల, పోలీస్ స్టేషన్ లలో కలిపి 33 ట్రాన్స్ఫార్మర్ చోరీల కేసులు నమోదు అయ్యాయి. దొంగలు వ్యవసాయం పోలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పక్కగా ఎంచుకొని చోరీలకు పాల్పడటం తో రైతులు ఆందోళన చెందారు.

ట్రాన్స్ఫార్మర్ లోని విలువైన రాగి తీగలను చోరికి గురికావడంతో ట్రాన్స్ఫార్మర్ పనిచేయక, రైతులు పంట పొలాలకు  సాగునీరు అందించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు ట్రాన్స్కో అధికారులకు కూడా ఈ ఘటనలు తలనొప్పిగా మారాయి. ఈ కేసులు కూడా పోలీసులకు సవాల్ గా మారాయి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల రైతుల కష్టాలను అర్థం చేసుకొని, ఎలాగైనా ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలను అరికట్టాలని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బైసా సబ్ డివిజన్లో నాలుగు స్పెషల్ పోలీస్ టీమ్ లను ఎఎస్పి పత్తిపాక సాయికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ చోరీ ఘటనలు జరగడంతో పోలీసులు కూడా కేసులను చేదించడానికి సీరియస్ గా  దృష్టి సారించారు. ఇదే సందర్భంలో ముధోల్  పోలీసులకు  ట్రాన్స్ఫార్మర్ చోరీ నిందితులు ముందుగా ఇద్దరు పట్టుబడ్డంతో, ముధోల్ సిఐ రవిందర్ నాయక్ నేతృత్వంలో ముధోల్ సర్కిల్ పోలిసులు మరింత లోతు గా కూపీ లాగి, ఎట్టకేలకు మీగితా నిందితులను  పట్టుకున్నారు. దీంతో 33 కేసుల నిందితులు ఒకేసారి పట్టుబడినట్లు అయింది. ఈ కేసుల నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడంతో రైతులు, ట్రాన్స్కో అధికారులకు  ఉపశమనం కలిగినట్లయింది.ఈ కేసులో ముధోల్  సర్కిల్ పోలీసుల చోరవపై  సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -