Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి

సీపీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు 
నవతెలంగాణ-మిడ్జిల్ 

సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ పునరుద్ధరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు, మండల అధ్యక్షులు వెంకటయ్య, జూనియర్ కళాశాల అధ్యాపకులు సంధ్యారాణి చరణ్ సింగ్ అన్నారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మంగళవారం  మండల కేంద్రంతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాల భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు మండల అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేసి పిఆర్సి ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఐదేళ్లు పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు లేని సీపీఎస్ విధానం సమాజం కోసం 30 ఏళ్లకు పైగా సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకని ఉద్యోగ సంఘం నాయకులు ప్రశ్నించారు. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు తప్ప ప్రభుత్వ భిక్ష కాదని స్పష్టం స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల ఉమ్మడి నిర్ణయం ప్రకారం సమస్యలు పరిష్కారం కాకుంటే సెప్టెంబర్ 6న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘ఉద్యోగుల సంకల్ప సభ’ నిర్వహించనున్నారు. ఒకవేళ సెప్టెంబర్ 9 లోగా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ మహా ధర్నా చేపడతామని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అక్బర్ అలీ, నరసింహ, జనార్దన్ రెడ్డి,  శ్రావణ్ కుమార్ , చరణ్ కుమార్, నిర్మలాదేవి ,ఉపాధ్యాయ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -