ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ అవకాశాలపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మోనాష్ యూనివర్సిటీ బృందతో ఆయన సమావేశమయ్యారు. మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనను వేగవంతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కొరతను అధిగమించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం పరిశోధనకే పరిమితం చేయకుండా, వాణిజ్య స్థాయిలో విస్తరించగల సాంకేతికతల అభివృద్ధి దిశగా మూడు సంస్థలు ముందుకు సాగాలని సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరగా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో డీప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్, మోనాష్ యూనివర్సిటీ డీన్ యాయిన్నిస్ వెంటికోస్, ఆస్ట్రేలియా–ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ మోహన్ ఎల్లిషెట్టి, ప్రొఫెసర్ రామన్ సింగ్, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ప్రత్యేక దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



