Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదివాసి ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

ఆదివాసి ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి యువతి ఊయిక శిరీషపై లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కోరం చిరంజీవి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదివాసి ప్రజలు, ప్రజాసంఘాలు పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. కన్నాయిగూడెం సోషల్ మీడియా వేదికగా కోరం చిరంజీవి మాట్లాడుతూ.. హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా ఆదివాసి మహిళలకు రక్షణ లేకపోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఆదివాసి మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం కాలం గడుపుతూ, మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆదివాసి యువతిపై జరిగిన దారుణ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి మహిళపై ఇంతటి ఘోరమైన దారుణం జరిగినప్పటికీ ఆదివాసి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆదివాసి మహిళలకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసి ఆడబిడ్డ ఊయిక శిరీషకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కోరం చిరంజీవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చాట్ల నర్సింగరావు, యాలం వీరన్న, తోలేం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -