– కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు…
నవతెలంగాణ – కుబీర్: కుబీర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నా నాటి నుంచి నేటి వరకు ప్రజా ప్రభుత్వ పాలన విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రజా రంజక పాలన అందిస్తూ ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 10 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన నాయకులకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే తాము పార్టీ మారుతున్నట్లు ఈ సందర్భంగా చేరిన నాయకులు ప్రకటించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అంతకుముందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ , మాజీ సర్పంచ్ పానది మీరా విజయ్ కుమార్ మాజీ చైర్మన్లు సంతోష్,రాములు, ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


