- Advertisement -
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. తాజాగా హీరో నాగ చైతన్య ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ పాటని లాంచ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజిషన్, కడలి సత్యనారాయణ లిరిక్స్, నకాష్ అజీజ్ వోకల్స్ అన్నీ ఈ పాట కథ, వారాహి అమ్మ వారి శక్తి, సినిమాలోని ఇంటెన్స్ వరల్డ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మి స్తున్న ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకులు ముందుకు రానుంది.
- Advertisement -



