Saturday, September 5, 2026
E-PAPER
Homeజిల్లాలుఉత్తమ ఉపాధ్యాయురాలిగా వై.శ్యామల

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా వై.శ్యామల

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మహాలింగంపేట ఆడిటోరియంలో ఘనంగా ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శెట్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న వై. శ్యామలను ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపిక చేసి సన్మానించారు. వై. శ్యామల పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ, వారికి పాఠశాల బ్యాగులు, నోటు పుస్తకాలు, టై, బెల్టులు అందిస్తూ విద్యాభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు.

అలాగే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందిస్తూ ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తున్నందుకు ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. మల్లికార్జున్, సహాయ జిల్లా విద్యాశాఖ అధికారి బలరాం, జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి కార్యదర్శి నీలం లింగం, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -