వాళ్లు కంటి వసారాలకు రాగానే
ఎగిరిపోయిన బాల్యం వచ్చి చేరుతుంది
పసితనం పాల పొంగైతది
ఎప్పుడో వదిలిన చిట్టి చిలక పలుకులు
ఊపిరి పోసుకుంటాయి
వయసు చిన్నగా అయిపోతుంది
వడవని బాల్యం నృత్యం చేస్తుంది
ఎంత బాల్యంలోకి చొచ్చుకపోయినా రూపం ఆపుతుంటది
పసితనం పాలమీగడై నవ్వుతుంది
ఆ నవ్వులను తెంపుకొని
గుండె గాయాలను మాన్పుకుంటము
చిందర వందరై బాధపడిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటాం
బాల్యాన్ని కౌగిలించుకుని సంతోషపడుతం
దానిపై బాధ్యతల రాళ్లు పెట్టకుండా
స్వేచ్ఛగా ఎగరనీయాలి
ముద్దు ముద్దు ముచ్చట్లను మన చీకటి గదిలోకి
ఒంపు కొని వెలుగు నింపుకోవాలి
తిరిగిరాని బాల్యాన్ని
తనువారా మనసారా తృప్తి పడనీయాలి
ఎ బాధర బందిలేని స్వర్గం బాల్యం
బాల్యాన్ని చూస్తే కడుపు నిండుతుంది
కమ్మని వాసన కొడుతుంది
కంచే చేను మేసినట్లు బాల్యాన్ని చెయ్యొద్దు
గుండెల్లి ఇస్తారి, 9849983874
బాల్యం
- Advertisement -
- Advertisement -



