Monday, September 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ కార్యాలయ సిబ్బంది 
చెన్నయ్య మృతి

సీపీఐ కార్యాలయ సిబ్బంది 
చెన్నయ్య మృతి

- Advertisement -


సంతాపం తెలిపిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో సుదీర్ఘ కాలం(దాదాపు 50 ఏండ్లు) పని చేసిన ఎల్ చెన్నయ్య (78) హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్‌లో అనారోగ్యంతో చికిత్స పొదుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించారు. చెన్నయ్య మఖ్దూం భవన్ నిర్మాణ పనులు చేయడానికి కూలీగా వచ్చారు. అతని పనితనాన్ని అప్పటి పార్టీ నాయకత్వం గుర్తించి అతనిని కార్యాలయంలో పనిచేయడానికి తీసుకున్నది. నిజాయితీగా సేవలందిస్తూ పార్టీ నాయకుల మన్ననలు పొందారు. చెన్నయ్య మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చెన్నయ్య అంత్యక్రియలు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -