విచారణ ఆశించిన స్థాయిలో లేదు సర్
రాష్ట్రవ్యాప్తంగా 47.79 లక్షల మందికి నోటీసులు జారీ..
హాజరు కాని వారికి మరోసారి నోటీసులు
సమాధానం ఇవ్వాల్సిందే : అధికారులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ‘సర్’ విచారణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగటం లేదు. బీఎల్వోలు ఓటర్లను నేరుగా కలిసి నోటీసులు ఇచ్చి అవగాహన కల్పించకపోవడమే ఈ సమస్యకు కారణమని తెలుస్తోంది. రాష్ట్రవ్యా ప్తంగా 47 లక్షల 79 వేల మందికి నోటీసులు జారీ కాగా, 32 లక్షల మంది నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతు న్నారు. విచారణకు హాజరు కాని వారికి మరోసారి నోటీసులు ఇస్తున్నారు. ఓటరు తుది జాబితాలో పేరు ఉండాలంటే కచ్చితంగా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నోటీసులు వచ్చిన వారు హాజరు కావడం లేదు
జుకు 2 లక్షల 32 వేల నోటీసులు జారీ చేయాలని సీఈవో కార్యాలయం లక్ష్యం నిర్దేశించింది. వాటిని ఓటర్లకు ఇచ్చే బాధ్యతను బీఎల్వోలకు అప్పగించారు. కొన్ని ప్రాంతాల్లో నోటీసులు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రికార్డుల్లో రాస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ లో 47 లక్షల 79 వేల మందికి నోటీసులు జారీ కాగా, 32 లక్షల మంది నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. నోటీసు లు అందుకున్న ఓటర్లు విచారణకు వచ్చి డాక్యుమెంట్లు సమర్పించటం లేదని అధికారు లు చెబుతున్నారు. అయితే బీఎల్వోలు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి నోటీసులు ఇవ్వకుండా ఫోన్ చేసి విచారణకు రావాలని చెప్పటంతోనే సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.
12 డాక్యుమెంట్లు అందుబాటులో లేక నిరాసక్తత
విచారణ సమయానికి వారం రోజుల ముందు ఓటర్లకు వ్యక్తిగతంగా నోటీసు ఇవ్వాలని సీఈవో కార్యాలయం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీఎల్వోలు ఇండ్లకు వెళ్లకుండానే ఓటరుకు ఫోన్ చేసి హియరింగ్‌కు రావాలని చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ డాక్యుమెంట్లు సమర్పించాలో అర్థం కాక కొందరు ఓటర్లు విచారణకు వెళ్లడం లేదని తెలుస్తోంది. మరికొందరు ఈసీ పేర్కొన్న 12 డాక్యుమెంట్లు అందుబాటులో లేక విచారణకు హాజరయ్యే విషయంలో నిరాసక్తత చూపుతున్నట్లు సమాచారం.రాజకీయ పార్టీలు నియమించిన బీఎల్వోలు కూడా ఓటర్లకు సహకరించటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు 5 లక్షల 74 వేల 504 మంది నోటీసులు అందుకొని డాక్యుమెంట్లు సమర్పిం చారు. తెలం గాణలో సుమారు 3 లక్షల మంది ఓటర్ల పేర్లను ఓకే చేసి, తుది జాబితాలో చేర్చేందుకు సిద్ధం చేశారు. 564 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా ఏఈఆ ర్‌వోలు, ఈఆర్‌వోలు, డీఈవోల స్థాయిలో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
కలెక్టర్ల స్థాయిలో దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్
కలెక్టర్ల స్థాయిలో సుమారు రెండున్నర లక్షల దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఓటు నమోదు, అడ్రస్, ఇతర వివరాల మార్పు కోసం సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు ఏడున్నర లక్షలను ఆమోదించారు. మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి. నిర్ణీత సమయానికి విచారణకు వెళ్లని వారికి రీ-షెడ్యూల్ నోటీసులు ఇస్తున్నారు. సుమారు 9 వేల మందికి మరోసారి నోటీసులు ఇచ్చారు. నోటీసు అందుకున్న వారు కచ్చితంగా విచారణకు హాజరై డాక్యుమెంట్లు సమర్పించాల్సిందేనని, లేకపోతే తుది జాబితాలో ఓటు ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నత్తనడకన సాగుతోన్న సర్ విచారణ ప్రక్రియ
తెలంగాణలో సర్ విచారణ నత్తనడకన సాగుతోంది. నోటీసులు అందుకున్న వారు ఓటును ధ్రువీకరించుకునే డాక్యుమెంట్లతో విచారణకు సకాలంలో వెళ్లడం లేదు. బీఎల్వోలు ఓటర్లను నేరుగా కలిసి నోటీసులు ఇచ్చి అవగాహన కల్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చే సమయంలో కనిపించిన గందరగోళమే ఇప్పుడూ కనిపిస్తోంది. నో మ్యాపింగ్, అనామలీస్ కేటగిరీల్లో 92 లక్షల 88 వేల 127 మందికి నోటీసులు జనరేట్ అయ్యాయి.



