తాత మధు ను సస్పెండ్ చేయాలి: కాంగ్రెస్ పార్టీ డిమాండ్
నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఖండించింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, హేమమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత నాయకుడు షేకాపూర్ సర్పంచ్ తుకారాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో గల దళితులంతా ఏకం కావాలనీ, స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల తాత మధును సస్పెండ్ అయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి దళితులంటే చిన్నచూపు చూస్తోందని వారు వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆందోళనలు చేపట్టడం, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాం పటేల్, హెచ్కేలూరు సర్పంచ్ లక్ష్మణ్, చిన్నతడుగురు గ్రామ సర్పంచ్ సూర్య వంశీ, ప్రకాష్, అంతాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
- Advertisement -
- Advertisement -



