నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురణ
క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు అక్టోబర్ 7 వరకు పొడిగింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తితో గడువు పొడిగించింది. దీంతో క్లెయి మ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం అక్టోబర్ 7 వరకు అవకాశం ఉంటుంది. నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురి స్తారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఓటర్లు, అధి కారులకు ఇదో పెద్ద ఉపసమనంగా భావిస్తున్నారు.
మొదటి నుంచి గందరగోళంగానే
తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) మొదటి నుంచి గందరగోళంగా ఉంది. ఎన్యూమరేషన్ సమయంలోనే అనేక ఇబ్బందులు తలెత్తగా, ప్రస్తుతం నోటీసుల ప్రక్రియ కూడా అలానే సాగుతోంది. బీఎల్వోల అవగాహన లోపం, నిర్లక్ష్యం అనేక చోట్ల కనిపిస్తోంది. దీంతో అభ్యంతరాలు, క్లైయిమ్ల స్వీకరణ కూడా మందకొడిగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నోటీసులు అందిం చాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం, కొన్ని చోట్ల నోటీసులు నేరుగా అందిస్తూ, మరికొన్ని చోట్ల ఫోన్ చేసి నోటీసులు తీసుకెళ్లాలని చెబుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా యి. దీనికి తోడు ప్రజల్లోను అవగాహన లోపం కనిపిస్తోంది. కొన్ని చోట్ల భారీగా నోటీసులు జారీ చేసింది. చాలా తక్కువ మంది మాత్రమే హియరింగ్కు హాజరవుతున్నారు.
బీఎల్వోల నిర్లక్ష్యం
విచారణ తేదీ నాటికి వారం రోజుల ముందుగానే ఓటర్లకు నేరుగా నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా, బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు నోటీసులకు బదులిచ్చేందుకు ఏయే డాక్యుమెంట్స్ అవసరమో, ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడమూ గందరగోళానికి కారణంగా తెలుస్తోంది. దీంతో విచారణకు కూడా హాజరుకావడం లేదని సమాచారం.
47.79 లక్షల మందికి నోటీసులు జారీ
ఇప్పటికి 47.79 లక్షల మందికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే అందులో ఏకంగా 32 లక్షల మంది నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో వారికి మరోసారి నోటీసులు ఇస్తున్నారు. ఓటర్ల ఫైనల్ లిస్ట్లో పేరు ఉండాలంటే కచ్చితంగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సర్ గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



