ఓటర్లలో భారీ వ్యత్యాసం..
న్యూఢిల్లీ : మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లలో భారీ వ్యత్యాసం ఉందని, దీంతో అధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సేవ చేయడం కష్టమవుతోందని అమిత్ షా ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ప్రస్తావించారు. 131వ రాజ్యాంగ సవరణ తదితర బిల్లులపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను హేతుబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఐదు లోక్‌సభ స్థానాల్లో ఓటర్ల సంఖ్య 20లక్షలకుపైగా ఉంది. రెండు స్థానాల్లో ఏకంగా 30లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. తెలంగాణలోని మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం పరిధిలో 37.80లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోనే ఇది అత్యధికం.కర్నాటకలోని బెంగళూరు నార్త్ నియోజకవర్గంలో 32.15లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో 29.48 లక్షలు, యూపీలోని గౌతమ్‌బుద్ధ నగర్‌లో 26.82 లక్షలు, వెస్ట్ ఢిల్లీలో 25.92లక్షల మంది ఓటర్లున్నారు. కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలో లక్షద్వీప్ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ కేవలం 58 వేల మంది ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం.దమన్ దీవ్‌లో 1.34లక్షల ఓటర్లు, లదాఖ్‌లో 1.9లక్షలు, దాద్రా నగర్ హవేలీ 2.83 లక్షలు, అండమాన్ నికోబార్ దీవుల్లో 3.15లక్షలు మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య కొంత మారే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మల్కాజిగిరిలోనే అత్యధిక ఓటర్లు
- Advertisement -
- Advertisement -



