Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఆర్సిని ప్రకటించి పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి

పిఆర్సిని ప్రకటించి పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి

- Advertisement -

లింగారెడ్డి డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
పసరలో డిటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం
నవతెలంగాణ – గోవిందరావుపేట

ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పిఆర్సి నీ ప్రకటించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని  డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పస్రాలో డెమోక్రటిక్స్ టీచర్స్ ఫెడరేషన్ ములుగు జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు గన్ రెడ్డి ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డీ.టీ.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య లు విచ్చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి  మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పిఆర్ సి నివేదిక తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని తెలియజేశారు.

తెలంగాణ విద్యా విధానంపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి సిఫారసులు హేతుబద్ధంగా లేవని, ఈ సిఫారసులు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు గొడ్డలిపెట్టని, తెలియజేశాడు. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తామనే మాటలు నమ్మశక్యంగా లేవని తెలిపారు. కౌన్సిల్ కు హాజరైన ఉపాధ్యాయులు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులుగా మనమంతా శాస్త్రీయ దృక్పథంతో విద్యా బోధన చేయాలని సైన్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు మాత్రమే మానవ ప్రగతికి మూలం అనే ఎరుకతో విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలియజేశారు. ములుగు జిల్లాలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ బలోపేతానికి జిల్లా మండల బాధ్యులు సమిష్టిగా కృషి చేయాలని తెలియజేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చాప బాబు  మాట్లాడుతూ జిల్లాలో  గత జిల్లా విద్యాశాఖాధికారి అవినీతిని బట్టబయలు చేయడంలో డి టి ఎఫ్ ముందుందని, భవిష్యత్తులో నిర్మాణాలు పెంచుకొని మరింత క్రియాశీలకంగా పని చేయాలని తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి రేగా నరేంద్ర కుమార్ వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా  జిల్లా మండల బాధ్యులు నివేదికపై చర్చించారు. అనంతరము ఎన్నికల అధికారిగా విచ్చేసిన రేపాక లింగయ్య  సమక్షంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీ గన్ రెడ్డి ఆది రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రేగా నరేంద్ర కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్. చంద్రారెడ్డి, టి.   సరోజన, ఏ. నాగభూషణం, కార్యదర్శులుగా టి. లక్ష్మయ్య, జి.కనకరాజు, బి సూర్య, ఎన్ రఘశర్మ లు, రాష్ట్ర కౌన్సిలర్స్ గా, చాప బాబు దొర, బి అనిత , ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఏ. చేరాలు సభ్యులుగా ఎస్. హనుమాన్, ఎండి ఫెరోజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారి నూతన కమిటీ చేత ప్రమాణస్వీ కారం చేయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -