Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని మచర్ల గ్రామాల్లో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ రైతులు తమ పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. దళారులకు తక్కువ ధరలకు అమ్మి నష్టపోకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని, లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఐకేపీ సిబ్బందిని కోరారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2389, ‘బి’ గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నసీర్, ఐకేపీ ఏపీఎం బుమేశ్వర్ గౌడ్  ,వార్డ్ సభ్యులు, వీడీసీ అధ్యక్షులు గంజి మహేందర్, సభ్యులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -