కొలనుపాకలో ఘనంగా 41వ వర్ధంతి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ బాపూజీ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. పెత్తందారీ వ్యవస్థ,విసునూరు దేశ్‌ముఖ్ దొరల అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.తన భూమి,హక్కులు, పండించిన పంటను కాపాడుకునేందుకు ఆమె చూపిన ధైర్యం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.ఈ భూమి నాది.. పండించిన పంట నాది.. తీసుకెళ్లడానికి దొర ఎవడు! నా ప్రాణం పోయాకనే ఈ భూమిని, పంటను మీరు దక్కించుకోగలరు అంటూ ఐలమ్మ దొరల దౌర్జన్యానికి ఎదురు నిలిచారని గుర్తుచేశారు.ఆమె మాటలను తూటాలుగా మలుచుకుని,అణచివేతకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగంలో విప్లవ చైతన్యాన్ని రగిలించిందన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ ఆశయాలను నేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మామిడాల బాలమల్లేష్,గ్రామ సర్పంచ్ బేదారబోయిన యకమ్మ వెంకటేష్,రాఘవాపురం సర్పంచ్ పరిదే మమతా సంతోష్,మాజీ అధ్యక్షులు మామిడాల నర్సింహులు,సోమయ్య,మాజీ సర్పంచ్ గంగుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య,మామిడాల భానుచందర్, అశోక్, మాజీ ఎంపీటీసీ ప్రశాంత్, పీఏసీఎస్ డైరెక్టర్ చాడా రాజు, బండ విరమల్లయ్య,అరె మల్లేష్,సోమరాజు, బాలరాజు,మామిడాల నవీన్,భాను, శంకర్ ప్రసాద్,మధు,కర్ణాకర్,క్రాంతి,వార్డు సభ్యులు, రజక కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



