- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు మృతి చెందాడు. ఈ నెల 7న మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్లో దుర్గాప్రసాద్(30) ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఓ యువతి, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో పోలీస్ స్టేషన్లోనే దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



