Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీవైఎఫ్‌ఐ మూడో మహాసభలో ఆలేరు నాయకులకు రిలీవ్

డీవైఎఫ్‌ఐ మూడో మహాసభలో ఆలేరు నాయకులకు రిలీవ్

- Advertisement -

యువత హక్కుల కోసం రాజీలేని పోరాటాలు : రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

చౌటుప్పల్‌లో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ (DYFI) మూడో మహాసభల్లో ఆలేరు పట్టణానికి చెందిన జిల్లా కమిటీ సభ్యులు చెన్న రాజేష్, వడ్డేమాన్ విప్లవ్ కుమార్ తమ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.మహాసభల సందర్భంగా సంస్థ కార్యకలాపాలు,భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్,రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ యువత హక్కుల సాధన కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం డీవైఎఫ్‌ఐ నిరంతరం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై యువతను చైతన్యపరుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.భవిష్యత్ పోరాటాలకు యువతను సన్నద్ధం చేస్తూ డీవైఎఫ్‌ఐని మరింత బలోపేతం చేయాలని వారు కోరారు.యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపాధి అవకాశాల కొరత తదితర సమస్యలపై సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో జిల్లా,మండల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -