Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ నోటీసుల విచారణ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ

ఎస్ఐఆర్ నోటీసుల విచారణ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పోచారం గ్రామంలో కొనసాగుతున్న నోటీసుల విచారణ ప్రక్రియను పరకాల ఆర్డీఓ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న నోటీసుల విచారణ తీరును పరిశీలించి, ఓటర్లకు అందుతున్న సేవలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని అన్నారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతీ, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాలు, కొత్త ఓట్ల నమోదు తదితర అంశాలపై స్థానిక ఓటర్లతో మాట్లాడారు. నోటీసుల విచారణ ప్రక్రియపై ఓటర్లు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ టి. విజయలక్ష్మి, డిప్యూటీ తహసిల్దార్ ఏ. సుమన్‌కుమార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పి. దామోదర్, బూత్ లెవెల్ సూపర్‌వైజర్ కృష్ణంరాజు, బూత్ లెవెల్ అధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -