Saturday, September 12, 2026
E-PAPER
Homeఆటలు‌ఫైనల్లో సబలెంకా, రిబకినా

‌ఫైనల్లో సబలెంకా, రిబకినా

- Advertisement -

సెమీస్‌‌లో ఓడిన అమెరికా అమ్మాయిలు
యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌ 2026

న్యూయార్క్‌ (‌యుఎస్‌ఏ)
యుఎస్‌ ఓపెన్‌‌లో బెలారస్‌ ‌భామ తిరుగులేని జోరు కొనసాగుతుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో వరుస సెట్లలో విజయం సాధించిన అరినా సబలెంకా మహిళల సింగిల్స్‌‌లో వరుసగా నాల్గో సారి టైటిల్‌ ‌పోరుకు చేరుకుంది. 7-5, 6-2తో అమెరికా అమ్మాయి, మూడో సీడ్‌ ‌జెస్సికా పెగులాపై టాప్‌ ‌సీడ్‌ ‌అరినా సబలెంకా గెలుపొందింది. న్యూయార్క్‌‌లో మరోసారి జెస్సికా పెగులాను చిత్తు చేసిన సబలెంకా.. ఇక్కడ వరుసగా 19వ విజయం నమోదు చేసింది. ఏడు ఏస్‌‌లు, మూడు బ్రేక్‌ ‌పాయింట్లతో మెరిసిన అరినా సబలెంకా.. జెస్సికా పెగులాపై ఏకపక్ష విజయం సాధించింది. తొలి సెట్లో సర్వ్‌ ‌నిలుపుకున్న జెస్సికా పెగులా.. సబలెంకాకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ 5-5తో స్కోరు సమంగా ఉన్న వేళ వరుసగా రెండు గేములు గెలుపొంది సబలెంకా తొలి సెట్‌‌ను ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో పెగులా డీలా పడిగా.. సబలెంకా దూకుడు పెంచింది. పాయింట్ల పరంగా 65-54తో సబలెంకా పైచేయి సాధించింది. గేముల పరంగా 13-7తో పెగులాను చిత్తు చేసింది. హార్డ్‌‌కోర్ట్‌ ‌క్వీన్‌‌గా దూసుకెళ్తున్న సబలెంకా యుఎస్‌ ఓపెన్‌‌లో ఐదో గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిల్‌‌పై కన్నేసింది. ఈ ఏడాది ఆశించిన ప్రదర్శన చేయని సబలెంకా.. 99 వారాల తర్వాత వరల్డ్‌ ‌నం.1 ర్యాంక్‌ ‌చేజార్చుకునే ప్రమాదంలో పడింది.

కానీ, శనివారం నాటి మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లో విజయం సాధిస్తే టైటిల్‌‌తో పాటు వరల్డ్‌‌నం.1 ర్యాంక్‌ ‌సబలెంకా సొంతం కానుంది.మహిళల సింగిల్స్‌‌లో మరో సెమీఫైనల్లో అమెరికా స్టార్‌ ‌క్రీడాకారిణి కొకొ గాఫ్‌‌పై కజకిస్తాన్‌ అమ్మాయి ఎలెనా రిబకినా విజయం సాధించింది. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌లో నాల్గో సీడ్‌ ‌కొకొ గాఫ్‌‌పై రెండో సీడ్‌ ‌ఎలెనా రిబకినా 3-6, 6-4, 6-4తో గెలుపొందింది. ఎలెనా రిబకినా ఐదు ఏస్‌‌లు, నాలుగు బ్రేక్‌ ‌పాయింట్లతో మెరువగా.. కొకొ గాఫ్‌ ‌నాలుగు ఏస్‌‌లు, మూడు బ్రేక్‌ ‌పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 88-82తో రిబకినా, గాఫ్‌ ‌హోరాహోరీగా పోటీపడ్డారు. రిబకినా 15 గేములు నెగ్గగా, కొకొ గాఫ్‌ 14 గేమ్‌‌లతో గట్టి పోటీ ఇచ్చింది. తొలి సెట్లో విజయంతో కొకొ గాఫ్‌ ‌ముందంజ వేసినా.. వరుసగా రెండు సెట్లలో పైచేయి సాధించిన ఎలెనా రిబకినా టైటిల్‌ ‌పోరుకు చేరుకుంది.

​ఫైనల్‌‌కు చేరేదెవరో
పురుషుల సింగిల్స్‌‌లో ఫైనల్స్‌ ‌రేసు రసవత్తరంగా మారింది. తొలి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌తో రష్యా ఆటగాడు కరెన్‌ ‌కచనోవ్‌ ‌తలపడనున్నాడు. భీకర ఫామ్‌‌లో ఉన్న జ్వెరెవ్‌‌ను ఢీకొట్టడం కరెన్‌‌కు అంత సులువు కాదు. మరో సెమీఫైనల్లో అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సెస్‌ ‌తియాఫో, బెన్‌ ‌షెల్టన్‌ ‌పోటీపడుతున్నారు. బెన్‌ ‌షెల్టన్‌ ‌క్వార్టర్‌‌ఫైనల్లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌ ‌కార్లోస్ అల్కరాస్‌‌కు షాక్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. నేడు సహచర ఆటగాడు ఫ్రాన్సెస్‌‌తో సెమీఫైనల్లో షెల్టన్‌ ‌ఫేవరేట్‌‌గా బరిలోకి దిగుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -