జిల్లా జడ్జి భరత లక్ష్మి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్
యువత చదువులతోపాటు క్రీడలలో పాలుపంచుకోవాలని, యువత విద్యార్థులు తమ కాలేజీ సమయాన్ని వృధా చేసుకోవద్దని, క్రీడల వల్ల సామర్థ్యంతో పాటు మానసిక తేజస్సు ఉత్సాహం సామాజిక చైతన్యం కలుగుతుందని నిజామాబాద్ జిల్లా జడ్జ్ భారత లక్ష్మి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో వారు నిర్వహించారు. నేడు సమాజంలో విద్యార్థులు చదువులో పోటీ తత్వం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. క్రీడలు మానసికంగా, శారీరకంగా చైతన్యవంతం చేయడానికి ఎంతో దోహదపడతాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సోమవారం ఎన్.ఎస్.సి నిజామాబాద్ ప్రీమియం లీగ్ క్రీడా పోటీలను ఆయన జిల్లా జడ్జి తో కలిసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి జీ.వీ.ఎం భారతి లక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్ , న్యాయశాఖ తదితర శాఖల్లో ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని ఇలాంటి తరుణంలో వారిని శారీరకంగా మానసంగా ఉత్సాహం కలిగించడానికి అందువలన ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) / ఎన్ఎస్ఈ కన్వీనర్ డిసిపి జి. బస్వా రెడ్డి , అదనపు డీసీపీ ( ఏ ఆర్ ) రామచంద్రరావు ఎన్.ఎస్.ఈ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవిత రెడ్డి , ట్రెజరర్ సంతోష్ , స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ , శివప్రసాద్ , దుశ్శాంత్ మరియు ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు. నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సిటిసి ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్ , వెంకట్ రెడ్డి , శ్రీనివాస్, రాజశేఖర్ , మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జ్ దుర్గాప్రసాద్ , సెకండ్ అడిషనల్ జడ్జి నారాయణ, పిడిఎం గోపి కృష్ణ , జిల్లాలోని సీఐలు ఎస్ఐలు జిల్లాలోని అడ్వకేట్లు తదితరులు పాల్గొనడం జరిగింది.ఇట్టి క్రీడలను ఎవరైనా ఆన్లైన్ ఆప్ లో చూడదలిచినటువంటి వారు క్రిక్ హీరోస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు. పోలీస్ 11 మరియు జ్యూడిషల్ 11 టాస్ వెయ్యగా పోలీస్ 11 టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది 8 ఓవర్ల తో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. రెండు పోలీసు 11 8 ఓవర్లలో 81/1, జ్యుడిషియల్ 11 8 ఓవర్లలో 37/1 రన్స్ చేయడం జరిగింది. పోలీస్ 11, టీం 44 రన్సు తేడాతో గెలుపొందడం జరిగింది.



