- Advertisement -
నవతెలంగాణ – మెండోరా
మండలంలోని సొన్ పెట్ గ్రామంలో ఉపాధిహామీ పనులను గ్రామ సర్పంచ్ నర్సవ్వ మల్కేశ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, వడ దెబ్బ తగలకుండా కూలీలు జాగ్రత్తగా పాటించాలని సూచించారు. పని ప్రదేశంలో మంచి నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయితీ కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు.
- Advertisement -



