రహదారి ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలి

– ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ-గోవిందరావుపేట : నిత్యం జరుగుతున్న రహదారి ప్రమాదాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పసర ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ అన్నారు. శుక్రవారం రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజలకు రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ మాట్లాడుతూ జనవరి 14వ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
Spread the love