నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు ఆయన అజీమ్ సుల్తానా ఫిన్లాండ్ ఎక్స్‌పోజల్ విజిట్ కు ఎంపికైనట్లు ఆ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు ప్రకటనలో తెలిపారు. నెల్లికుదూరు పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో సోషల్ స్టడీస్ ఈజీగా, తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న ఎంఎ అంజుమ్ సుల్తానా ఫిన్లాండ్ ఎక్స్పోజర్ విజిట్‌కు ఎంపికయ్యారు.
దీంతో ఉపాధ్యాయ బృందం అర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ఫిన్లాండ్లోని వినూత్న, అనుభవాత్మక మరియు కార్యకలాప ఆధారిత బోధనా పద్ధతులు, సాంకేతికత వినియోగం, సమ్మిళిత విద్య, మూల్యాంకన విధానాలను తెలుసుకోవడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అక్కడ పొందిన జ్ఞానం, అనుభవాలను తన విద్యార్థులకు తరగతి గది కార్యకలాపాలు , ప్రాజెక్టులు, డిజిటల్ వనరుల ద్వారా అందించి చదువును మరింత ఆసక్తికరంగా, అర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు జిల్లా అధికారుల అనుమతి తో జిల్లా లోని సహ ఉపాధ్యాయులతో పంచుకుంటానని తెలిపారు.



