Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్ స్పై డ్రామా

యూనిక్ స్పై డ్రామా

- Advertisement -

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘సెన్సార్‌ అభ్యంతరంతో ‘చైనా పీస్’ టైటిల్‌ను ‘సీక్రెట్‌ సోల్జర్‌’గా మార్చాల్సి వచ్చింది. ఇది స్పై డ్రామా. ఇందులో స్పై యాక్షన్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇండియా కి సంబంధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి?, ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఒక లైన్. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మా ఇద్దరి క్యారెక్టర్స్ ఈ వరల్డ్‌లోకి ఎలా వచ్చాయి అనేది చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. మంచి హ్యూమర్, ట్విస్టులు ఉంటాయి. ఫైనల్‌గా సినిమా ఒక మంచి ఫ్రెండ్‌షిప్ కథగా కూడా ఉంటుంది. స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్‌ను ఆడి యన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మా సినిమాని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చూశారు. అలాగే కొంతమంది తెలియని ఆడి యన్స్‌ను తీసుకొచ్చి చూపించాం. చూసిన వాళ్లందరూ కూడా బ్యూటిఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మేము ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూస్తాము. ఆ కోణంలో చూసుకున్నప్పుడు చాలా నచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -