Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు ఎండదెబ్బ.!

పశువులకు ఎండదెబ్బ.!

- Advertisement -

అప్రమత్తంగా ఉంటేనే ముగజీవాల ఆరోగ్యం
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలో వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతోపాటు వేడి గాలులు జనజీవనంతోపాటు పశువులను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వేడి ఎక్కువైన ప్రజలు ఫ్యాన్, లేదా కూలర్ల ఎదుట సేద తీరుతున్నారు. మరి ఇబ్బంది పడితే ఏసీలో చల్లగా గడిపేస్తారు. కానీ పశువులు మాత్రం మండే ఎండలకు అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితి. వాటిని పోషకులే దగ్గరుండి చూసుకోవాలి. పశువుల విషయంలో అప్రమత్తంగా ఉంచకపోతే అనర్దాలు సంభవించే అవకాశాలున్నాయి.

వడదెబ్బ లక్షణాలు..
పశువులు సరిగా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. వడదెబ్బతో ప్రభావం వల్ల చూలు పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పశువుల్లో పున రుత్పత్తి వక్రియ కుంటుపడుతుంది. పాడిపశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుంది. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని తాలి విచే ప్రాంతానికి చేర్చాలి. శరీర ఉష్ణో గ్రత సాధారణ స్థాయికి తీసుకురావడానికి పలుమార్లు నీటితో కడగాలి. తాగునీటిని అందుబాటలులో ఉంచాలి. వెంటనే పశువైద్యా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి ఇంజక్షన్స్ వేయించాలి. వాటిని పోషకులే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండ కపోతే అనర్దాలు సంభవించే అవకాశం ఉంది.

నివారణ చర్యలు..
వేసవిలో పశువులను పగటివేళ మేతకు వదల రాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజుకు కనీసం రెండు సార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు కుంటలు ఈదనివ్వాలి. గాలి, వెలుతురు ప్రసారం అయ్యేలా ఎత్తైన కొట్టం గడ్డితో నిర్మించాలి. రేకులుంటే వరిగడ్డి పరిచి మధ్యాహ్నం వేళలో నీరు చల్లాలి. ఉదయం సాయంత్రం పాలు పితికెటప్పుడు పొదుగును చల్లటి నీటితో కడగాలి.

ఎండలో బయటకు వదలొద్దు: అభిలాస్…పశు వైద్యాధికారి
ఎండకాలంలో పశు వులను జాగ్రత్త కాపాడాలి. మధ్యాహ్నం పశువులను మేతకు బయటికి పంపవద్దు. వేసవిలో పశువులకు దాహం ఎక్కువగా వేస్తుంది. తాగునీటి సదుపాయం పశువులకు అందుబాటులో ఉంచాలి. పశువులకు పచ్చిగడ్డి వేయాలి. పత్తి చేనుల్లో మేతకు వదలవద్దు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -