Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనగామలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్ 
బీబీపేట మండలం జనగామ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ బుధవారం   ప్రారంభించారు . రైతులకు తగిన మద్దతు ధర కల్పిస్తూ, సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ జి. రమేష్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. మానిటరింగ్ ఆఫీసర్లు జే. నాగేష్, టీ. సురేష్ కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించబడుతుందని చెప్పారు. సీఈఓ నర్సా గౌడ్ కేంద్రం వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రమణారెడ్డి,   గ్రామ పెద్దలు వెంకట్రాంరెడ్డి, సిద్ధరామిరెడ్డి, పాత పండరి , రైతులు సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -