• తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్
నవతెలంగాణ -పెద్దవంగర
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్, ఏపీఎం ఎండీ మహబూబ్ పాషా అన్నారు. బుధవారం మండలంలోని పెద్దవంగర, బొమ్మకల్, బీసీ తండాల్లో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులు పారిజాత, యాకయ్య, రమేష్, పరమేశ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.
సన్న వడ్ల కు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ అదనంగా ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి, గరిష్ట మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ భూక్యా లష్కర్, జీపీవో జ్యోతి, ఉపసర్పంచ్ వినోద్, ఏఎంసీ డైరెక్టర్ పూర్ణచందర్, సుంకరి ఓంకార్, సీసీలు సుధాకర్, సుజాత, ఆపరేటర్ అనిల్, వీవోఏలు మణేమ్మ, మంజుల, సంధ్య, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.



