Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి

మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి

- Advertisement -

– సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

కార్మికుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక చట్టాలను బలహీనపరిచే దిశగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో సిఐటియు మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యుడు మొరిగాడి రమేష్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరు మల్లేశం మాట్లాడుతూ దాదాపు 140 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు సాగించిన పోరాటం ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఆ పోరాటాల్లో కార్మికులు చిందించిన రక్తఫలితంగానే ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతనాలు,ఇతర కార్మిక సంక్షేమ చట్టాలు అమలులోకి వచ్చాయని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకురావడం కార్మిక వర్గానికి ప్రమాదకరమని హెచ్చరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మేడే వారోత్సవాలను సంఘటితంగా నిర్వహిస్తూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు కార్మిక నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -