Wednesday, April 22, 2026
E-PAPER
Homeజిల్లాలుటీపీటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయండి

టీపీటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ-మిరుదొడ్డి: టీపీటీఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్‌ను మిరుదొడ్డి మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మిరుదొడ్డి మండల అధ్యక్షులు అందే రామచంద్రం మాట్లాడుతూ.. విద్యాసదస్సు ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టిపిటిఎఫ్ లక్ష్యమని తెలిపారు.ఈ రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొననున్నారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయం పై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణలో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యాదగిరి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట రామలింగం,శ్రీనాథ్, శ్రీకాంత్, శ్రీనివాస్, గౌస్,వెంకటేశ్వర్లు, ప్రసన్న, లావణ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -