– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని నాగాపూర్ గ్రామ పరిధిలోని మంజీర చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరవడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌలిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్ ను ఆరా తీసి, పలు సూచనలు చేశారు. ఉపాధి పని ప్రదేశంలో కూలీలు తాగినందుకు నీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. పని విరామ సమయంలో సేద తీరేందుకు షడ్ నెట్ లను ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్, పంచాయతీ కార్యదర్శి కాందేష్ సంధ్య, ఈజీఎస్ సిబ్బంది సుభాష్, తదితరులు పాల్గొన్నారు.



