నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ఐకేపి మహిళ క్రాంతి ప్రథం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సదుపాయాన్ని రైతులు ఉపయోగించుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను విక్రయించాలని సూచించారు. గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రం లేదని, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి కృషితో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయ్యిందన్నారు. గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, వార్డు సభ్యులు కుందేటి శ్రీనివాస్, పెద్ది సృజన్, కల్లెడ రాణి, కనుక నరసయ్య, సీసీ అలేఖ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, దేవాయి రాజేశ్వర్, మేకల క్రాంతి, రైతులు బద్దం రాకేష్, గడ్డం విశాల్, ఎడ్ల విట్టల్, నోముల రమేష్, కొమ్ముల రజినీ కాంత్, వివో అధ్యక్షులు, సిఏలు, తదితరులు పాల్గొన్నారు.



