Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ

విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాత స్పోర్ట్స్ యూనిఫామ్ లను గురువారం నాడు వితరణ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత విద్యార్థులకు  వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ.. దోస్త్ పల్లి గ్రామ నివాసి అయినా పండరి అనే యువకుడు ప్రాథమిక పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి కావడం విశేషం. పండరి ఎమ్మెస్సీ & బీఈడీ (M. Sc & B. Ed ) విద్యను పూర్తి చేశారు. ఇతను జుక్కల్ మండల కేంద్రం లో “సద్గురు కాడ సిద్దేశ్వర ఫర్టిలెజర్”  పేరు తో వ్యవసాయానికి సంబందించిన మందుల దుకాణం , వ్యాపారం నిర్వహిస్తున్మాడు. దోస్త్ పల్లి గ్రామ శాశ్వత నివాసి అయిన పండరికి మొదటినుంచి పాఠశాల అభివృద్ధి  గురించి తన వంతు ఏదైనా సహకారం చెయ్యాలనే మక్కువ ఎప్పుడు ఉండేది.

ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించాలనే తన ఆలోచనను ప్రధానోపాధ్యాయులతో తెలియచేసి, విద్యార్థుల సంఖ్య, డ్రెస్ సైజు వంటి వివరాలు తీసుకొని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్పోర్ట్స్ యూనిఫామ్ డిజైనర్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి విద్యార్థుల సరిగ్గా సరిపోయే విధంగా డ్రెస్ తయారు చేయించి తెప్పించడం జరిగింది. నాణ్యమైన స్పోర్ట్స్ యూనిఫామ్ దాత అందించడం జరిగిందని, టీ – షర్ట్ మీద ప్రాథమిక పాఠశాల లోగో కూడ ప్రింట్ చేయించడం జరిగిందని అన్నారు . దాత 40 జతల డ్రెస్ మా పాఠశాల విద్యార్థుల కోసం అందించడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ దాత అయిన పండరికి హృదయపూర్వక అభినందనలు తెలియచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారొతి , పండరి కుటుంబ సభ్యులు,హన్మంత్ రెడ్డి -జెడ్పిహెచ్ఎస్ జుక్కల్ కాంప్లెక్స్  హెచ్ఎం , పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. శంకర్  , ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు- ఇతరులు పొల్గొనడం జరిగింది. జడ్.పి.హెచ్.ఎస్ జుక్కల్ కాంప్లెక్స్  హెచ్ఎం హన్మాంత రెడ్డి  దాత మరియు అతని తల్లిదండ్రులకు సన్మానించి అభినందించడం జరిగింది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -