Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుభవాతావరణంలో గ్రామపాలక వర్గం,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు,పంచాయితీ సెక్రెటరీ పాల్గొని వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం పిల్లలమర్రి లావణ్య (భాస్కర్ భార్య) నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.అనంతరం ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాలక వర్గం తరఫున నూతన వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరిమార్తి రేణుక నరసయ్య, ఉప సర్పంచ్ పద్మ శ్రీ, శశిరేఖ సుదర్శన్, జిల్లా యూత్ నాయకుడు ఉట్కురి సురేష్, వార్డ్ సభ్యులు కడకంచి శ్రీలత, కృష్ణ, తమ్మడి అంజయ్య, ఊట్కూరి అంజయ్య, కుర్రీ సాయికుమార్, కడకంచి రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నాయకుడు నోముల వెంకటేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అన్నం సిద్దులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -