Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు అడ్డంకులు

ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు అడ్డంకులు

- Advertisement -

– కంప్యూటర్ ఆపరేటర్‌పై ఆగ్రహం
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఎస్సీ కార్పొరేషన్ పాల పశువుల కొనుగోలు పథకం (విజయ) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సర్టిఫికెట్ల జారీ ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్టూరు శ్రీకాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పునుంతల మండల రెవెన్యూ కార్యాలయంలో  కులం, ఆదాయం సర్టిఫికెట్లకు జీపీఓ, ఆర్‌ఐల ఆమోదం వచ్చినప్పటికీ కంప్యూటర్ ఆపరేటర్ అప్రూవల్ ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. 45 రోజుల తర్వాత రావాలని చెప్పడం, ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు వెళ్లినా స్పందించకుండా “ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా లబ్ధిదారులు పథకాలకు దరఖాస్తు చేసే అవకాశం కోల్పోతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -