నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు పెద్ద చెరువు కట్టు కాల్వ అభివృద్ధి, పూడికతీత కోసం ప్రత్యేకంగా సమాధి అధికారులతో చర్చించి అధిక నిధులు కేటాయించిన మహబూబాద్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ రుణపడి ఉంటామని గుగులోతు బాలాజీ నాయక్ ఇట్టే దేవేందర్ రెడ్డి, రావుల సతీష్, మద్ది రాజేష్, ఆకుతోట సతీష్ లు అన్నారు. ఆదివారం కట్టు కాలువలో నీరు రావడంతో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసిన స్వర్గీయ కాసం లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా కష్టపడి వాగు పూడికతీతకు, కట్టు కాల్వ పూడికతీతకు ఎంతో శ్రమించిన లక్ష్మారెడ్డి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నామి తెలిపారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ కాల్వకు నిధులు మంజూరు చేసి, ఆకేరువాగును దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర పూడికతీసి, ఆకేరువాగు నుంచి నెల్లికుదురు పెద్ద చెరువుకు నీరు సక్రమంగా చేరేలా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. గత పది, పదిహేను సంవత్సరాలుగా కాల్వలో చెట్లు, చేమలు పెరిగి, పూడిక పేరుకుపోయి కాలువ సక్రమంగా లేకపోవడంతో నీరు చెర్లోకి రాక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గత నాయకులకు, అధికారులకు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకున్న పాపన్న పోలేదని ఆవేదన వ్యక్తం చెందారు. మళ్ళీ ఇన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టు కాల్వ మరమ్మతులు, పూడికతీత కోసం రూ.37 లక్షల నిధులు మంజూరు చేయించిన మానుకోట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ కు నెల్లికుదురు మండల ప్రజలు, రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆకేరువాగు నుంచి ఏడు, ఎనిమిది అడుగుల ఎత్తుతో వరద నీరు కట్టు కాలువలో ప్రవహిస్తుండటంతో, పెద్ద చెరువుకు నీరు చేరుతున్న దృశ్యాన్ని చూసి రైతులు ఎంతో ఆనందం, ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మంచాల వెంకన్న , రావుల సతీష్ , మద్ది రాజేష్, ఎండి అఫ్రోజ్, కురిసెట్టు వెంకన్న , బాబురావు, రఘుపతి, యాకయ్య, మల్లయ్య, కరణేశాయి, బండి శ్రీను, కొంపెలి శ్రీశైలం, గుండెపేన్ ఐలయ్య, చంద్రు సాయి, సలుగు విరేష్, కుమ్మరి కుంట్ల మౌనేందర్, మాదాస్ రవి, బన్నీ, సాయి తదితరులు పాల్గొన్నారు.



