Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంవసుంధర కంచుకోటలో బీజేపీ పతనం

వసుంధర కంచుకోటలో బీజేపీ పతనం

- Advertisement -

రాజస్తాన్‌‌లో అధికారంలో ఉన్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టాలను చవిచూసింది. అయితే స్వల్ప మెజారిటీతో ఊపిరి పీల్చుకుంది. మొత్తం 10,200 వార్డులలో బీజేపీ 4,171, కాంగ్రెస్ 3,597 స్థానాలను గెలుచుకున్నాయి. స్వతంత్రులు 2,250 స్థానాలను గెలుచుకున్నారు. ఇతర పార్టీలలో ఆప్ 42, ఆర్ఎల్‌పి 63, బీఎస్పీ 19, బీఏపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా ప్రాతినిధ్యం వహిస్తున్న ఝల్వార్ నగర పాలక‌లో కాంగ్రెస్, బీజేపీని ఓడించింది. 45 వార్డులకు గాను కాంగ్రెస్ 29 గెలుచుకోగా, బీజేపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 1, స్వతంత్రులు 2 గెలిచుకున్నారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న భరత్‌పూర్ కార్పొరేషన్‌లో స్వతంత్రులకు మెజారిటీ ఉంది. మొత్తం 65 స్థానాలకు గాను 26 మంది స్వతంత్రులే ఉన్నారు. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 7, బీఎస్పీ, ఆర్ఎల్‌పిలకు చెరో సీటు లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -