- Advertisement -
ఢాకా : నిషిద్ధ అవామీలీగ్‌కు చెందిన ఏడుగురు సీనియర్ నాయకులకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మంగళవారం మరణశిక్ష విధించింది. 2024లో జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనను వీరు ప్రోత్సహించారని, అందులో ప్రత్యక్ష పాత్ర పోషించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. మరణశిక్షకు గురైన వారిలో అవామీలీగ్ ప్రధాన కార్యదర్శి, రోడ్డు రవాణా శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ ఖదర్, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఏఎఫ్‌ఎం బహుద్దీన్ నసీమ్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మాజీ సహాయ మంత్రి మహమ్మద్ అలీ అరాఫత్ ఉన్నారు. నిందితులను పరోక్షంగా విచారించిన త్రిసభ్య ట్రిబ్యునల్ ఈ తీర్పును వెలువరించింది.
- Advertisement -



