అసెంబ్లీలో ప్రసంగించనున్న రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం పది గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెక్షన్ 22ఏ అంశంపై చర్చ కొనసాగుతుందని అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి మంగళవారం తెలిపారు. 22ఏ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం చర్చను ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. 22ఏ అంశం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరిగినట్టు తెలిసింది. 22ఏ నిషేధిత జాబితా వల్ల సామాన్య ప్రజలకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశమున్నది. ఉద్దేశపూర్వకంగానే ప్రజల భూములు, ఆస్తులను 22ఏ పరిధిలో చేర్చినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో స్పందించే అవకాశమున్నది. ప్రతిపక్షాలకు సమాధానం చెప్తారని తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడతారు, ఏం ప్రకటన చేస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
22ఏ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏమైనా ఉపశమనం కలుగుతుందా?అన్నదాని కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు ధరణి పోర్టల్‌లో లోపాల వల్ల బీఆర్‌ఎస్ హయాంలో భారీగా భూదందాలు జరిగాయనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వివరించనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా మాజీమంత్రి హరీశ్‌రావు, అతని మామ భూబదలాయింపులను ప్రోత్సహించిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ నేతల అక్రమ భూదందాలపై విచారణకు అదేశించే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది. ఇప్పటికే ధరణి అక్రమాలపై సెట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ధరణిపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించింది. ఆ నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు. దీనిపైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలిసింది. దీంతో అందరి చూపు బుధవారం జరిగే అసెంబ్లీ సమావేశాలపైనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. 22ఏ అంశంపై చర్చ ముగిసిన అనంతరం ఎల్‌నినో ప్రభావంపై లఘు చర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి తెలిపారు
22ఏపై నేడు సీఎంకీలక ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



